Sunday, July 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్ర వైఖరి వల్లే యూరియా లోటు : మంత్రి తుమ్మల

కేంద్ర వైఖరి వల్లే యూరియా లోటు : మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలో యూరియా లోటు ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి నెల రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో ఎరువుల సరఫరాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను వానకాలం సీజన్‌కు కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్‌ 2025 నుంచి జూన్‌ 2025 వరకు మొత్తం 5.00 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈ మూడు నెలల్లో రాష్ట్రానికి కేవలం 3.07 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని తెలిపారు. దీంతో మొత్తం 1.93 మెట్రిక్‌ టన్నుల యూరియా లోటు ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సరఫరా పెంచాలంటూ ఇప్పటికీ ఐదుసార్లు లేఖలు రాసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేంద్ర మంత్రులను కోరారని గుర్తు చేశారు. ఇప్పటి దాకా ఏర్పడిన 1.93 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటుతోపాటు జులై మాస ంలో ఇంకా సరఫరా కావాల్సిన 0.44 మెట్రిక్‌ టన్నుల ఎరువులను, ఆగస్టు నెలవారీగా కేటాయింపులతో కలిపి సరఫరా చేయాల్సిందిగా కేంద్ర మంత్రికి మంత్రి మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు అమ్మకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -