నవతెలంగాణ – భిక్కనూర్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది చేత గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కీమోథెరపీ తీసుకుంటున్న వారిని గుర్తించి వివరాలు సేకరించడం జరిగిందని మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. నాన్ కమ్యూనికేబుల్ డిసిజెస్ ప్రోగ్రాం ఆఫీసర్ శిరీష ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని సందర్శించి ఇంటిలో ఎవరైనా క్యాన్సర్ వారితో బాధపడుతున్నా వారి వివరాలు సేకరించడం, పాలియేటివ్ కేర్ కార్యక్రమంలో భాగంగా పక్షవాతం, ఇతర జబ్బులతో మంచం పట్టిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి దివ్య, హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు, తదితరులు ఉన్నారు.
క్యాన్సర్, పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ర్యాపిడ్ సర్వే
- Advertisement -
RELATED ARTICLES