Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంఖ‌నిజ తవ్వ‌కాల‌ ఒపంద్పంపై ఉక్రెయిన్-అమెరికా సంత‌కాలు

ఖ‌నిజ తవ్వ‌కాల‌ ఒపంద్పంపై ఉక్రెయిన్-అమెరికా సంత‌కాలు

న‌వతెలంగాణ‌- హైద‌రాబాద్‌: ఉక్రెయిన్‌-అమెరికాల‌ మధ్య ఖనిజాల తవ్వకాల ఒప్పందానికి తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఇరుదేశాలు ఆ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బీసెంట్‌, ఉక్రెయిన్‌ ఫస్ట్‌ డిప్యూటీ ప్రధాని యులియా సిర్దెంకో ఖనిజాల తవ్వకాల ఒప్పంద ప‌త్రాల‌పై సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్‌లో అరుదైన సహజ వనరులు అయిన అల్యూమినియం, గ్రాఫైట్‌, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి లభించినట్లైంది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయాల్సి ఉండగా, ఓవల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య మీడియా ముందే మాటల యుద్ధం జరిగింది. దీంతో అప్పటినుంచి ఇది అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు చాలా రోజులుగా తెరవెనుక ప్రయత్నాలు సాగించాయి. ఎట్టకేలకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img