Wednesday, April 30, 2025
Homeట్రెండింగ్ న్యూస్గొప్ప సామాజిక విప్లవకారుడు బసవన్న: కేసీఆర్

గొప్ప సామాజిక విప్లవకారుడు బసవన్న: కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించి పోరాడిన సామాజిక అభ్యుదయవాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు బసవేశ్వరుని జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక సేవను స్మరించుకున్నారు. ధార్మిక ప్రవచనాలు, వచన సాహిత్యం, వాటి కార్యాచరణ ద్వారా సమానత్వం కోసం పాటుపడిన గొప్ప సామాజిక విప్లవకారుడు బసవన్న అని కేసీఆర్ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన దార్శనిక పాలకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నారని అన్నారు. బసవేశ్వరుని ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img