Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మృతులను అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ, శాకమ్మగా గుర్తించారు. వీరంతా రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందినవారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందడంతో దొడగట్ట గ్రామంలో విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img