నవతెలంగాణ – హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, ‘దసరా’ చిత్రంతో విశేష గుర్తింపు పొందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నటుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దీనిపై నాని స్పందిస్తూ.. ప్యారడైజ్’ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ పనులు మొదలుపెడతామని నాని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ మెగా ప్రాజెక్ట్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ‘దసరా’తో తనదైన మార్క్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
చిరంజీవి సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన నాని
- Advertisement -
RELATED ARTICLES