Wednesday, December 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజమున మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటు

జమున మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటు

- Advertisement -

– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లంగ జమున గుండెపోటుతో మరణించడం ప్రజాతంత్ర ఉద్యమానికి, కుటుంబానికి తీరనిలోటని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని వీరనారి ఐలమ్మ భవన్‌లో ఐద్వా అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి అధ్యక్షతన సంతాపం సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమున పేదలకు రేషన్‌కార్డులు, ఇండ్ల స్థలాలు, ఇండ్ల కోసం నిర్వహించిన పోరాటాల్లో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. భార్య, భర్త మధ్య తగాదాలను పరిష్కరించడం, వారికి కౌన్సిలింగ్‌ చేసి ఆ కుటుంబాలను చక్కదిద్దడంలో ఆమె కృషి అభినందనీయమని తెలిపారు.

సంఘం పట్ల నిజాయితీ, నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఐద్వా జెండాను వీడలేదన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకోవడమే అమెకు నిజమైన నివాళి అన్నారు. సంతాప సభలో ఐద్వా సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, పి ప్రభావతి, రాష్ట్ర నాయకులు ఎమ్‌ వినోద, పి శశికళ, ఎమ్‌డీ షబానా బేగం, బి అనురాధ, కె నాగలక్ష్మి, వై వరలక్ష్మి, ఎ శారద తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -