Wednesday, April 30, 2025
Homeఆటలుటీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు హ‌త్య‌ బెదిరింపులు

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు హ‌త్య‌ బెదిరింపులు

నవతెలంగాణ – హైదరాబాద్: భార‌త క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్‌, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు హ‌త్య‌ బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ‘ఐసిస్‌ కశ్మీర్‌’ నుంచి రెండు మెయిల్స్‌ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఆయ‌న‌ ఫిర్యాదు చేశాడు. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరాడు. గంభీర్ తక్షణ చర్య కోరుతూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారని మాజీ ఎంపీ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది. ఈ నెల 22న గౌతీకు రెండు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఒకటి మంగళవారం మధ్యాహ్నం రాగా, మరొకటి అదేరోజు సాయంత్రం వచ్చింది. రెండిటిలోనూ ‘ఐ కిల్‌ యూ’ (IKillU) అనే సందేశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయ‌న రాజిందర్ నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన ఢిల్లీలోని రాజిందర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img