– ముగిసిన స్వేచ్ఛా వాణిజ్య యుగం
– సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆందోళన
సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టారిఫ్ విధానాలపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మండిపడ్డారు. ఇటీవల వాంగ్ తమ దేశాన్ని ఉద్దేశించి అరుదైన ప్రసంగం చేశారు. ట్రంప్ నిర్ణయాలను ఆయన భూకంప మార్పుగా అభివర్ణించారు. సింగపూర్ వంటి చిన్న దేశాలను అణచివేసే నిర్ణయాలన్నారు. ఇక స్వేచ్ఛా వాణిజ్య యుగం ముగిసినట్లేనని పేర్కొన్నారు. ” ట్రంప్ విధానం మరింత ఏకపక్ష, రక్షణాత్మక, ప్రమాదకర మైంది. మనం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాము. ఇంతకాలం సింగపూర్ 10 బేస్ టారిఫ్ శ్రేణీలో ఉంది. దేశం వారీగా వారి స్వంత ఇష్టపడే నిబంధన లపై మాత్రమే వ్యాపారం చేయడం ద్వారా అన్ని దేశాలకు, ముఖ్యంగా సింగపూర్ వంటి చిన్న దేశాలకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది పూర్తి స్థాయి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.. కానీ ప్రమాదాల గురించి మనం స్పష్టంగా ఉండాలి. సింగపూర్ ప్రతీకార సుంకాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇతర దేశాలు అదే సంయమనాన్ని చూపించకపోవచ్చు. మనకు ఒకప్పుడు తెలిసిన ప్రపంచ ప్రశాంతత. స్థిరత్వం తిరిగి రాదు.” అని వాంగ్ పేర్కొన్నారు.
ట్రంప్ టారిఫ్‌లు ప్రమాదకరం
- Advertisement -