- Advertisement -
– 29 పైసలు క్షీణత.. రూ.88 చేరువకు
– ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతూనే ఉంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనిశ్చితికి తోడు, ట్రంప్ మరిన్ని సుంకాలను విధించనున్నట్టు ప్రకటించడంతో మంగళవారం రూపాయి విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. మరోవైపు స్టాక్ మార్కెట్ల వరుస పతనం.. ఎఫ్‌ఐఐలు తరలిపోవడం తదితర పరిణామాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు క్షీణించి 87.95కు దిగజారింది. ఇంతక్రితం ఫిబ్రవరి 10న ఇంట్రాడేలో 87.95 కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ముడి చమురు బ్యారెల్ ధర 0.28 శాతం తగ్గి 68.57 వద్ద ముగిసింది.
- Advertisement -