Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుత్వరలో మరో 20 యంగ్‌ ఇండియా స్కూళ్లకు టెండర్లు

త్వరలో మరో 20 యంగ్‌ ఇండియా స్కూళ్లకు టెండర్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మించాలని రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చిలో 55 పాఠశాలల నిర్మాణానికి రూ.11,000 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిర, షాద్‌నగర్‌‌ల్లో టెండర్లు పిలవగా వీటి పనులు మేలో ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరో 11 పాఠశాలలకు టెండర్లు ఆహ్వానించారు. అదనంగా 20 స్కూళ్లకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img