- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేషియాలోని జావా ద్వీపంలో శనివారం 6.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. భూకంప కేంద్రం 376 కిలోమీటర్ల లోతులో ఉంది. డీప్-ఫోకస్ భూకంపం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన తక్షణ సమాచారం అందలేదు. ప్రాణ భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, మలుకు ద్వీపం సమీపంలోని బండా సముద్రంలో శుక్రవారం 6.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
- Advertisement -



