- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్, అల్వాల్, లింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, సూరారం, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
- Advertisement -