Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్దండకారణ్యంలో ఆదివాసీలపై దాడులను ఆపాలి.!

దండకారణ్యంలో ఆదివాసీలపై దాడులను ఆపాలి.!

– ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి..

– ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక

– బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ

నవతెలంగాణ – మల్హర్ రావు

దండరకాన్యంలో ఆదివాసులపై దాడులు ఆపాలని ఆదివాసీ గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కొయ్యురు గ్రామం ఆదివాసీ గూడెంలో ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏప్రిల్ 20న బద్దం ఎల్లారెడ్డి భవన్, గణేష్ నగర్, కరీంనగర్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ కరపత్రాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న మాట్లాడారు అడవులలోని కొట్లాది అటవీ, ఖనిజా సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి 1990 నుండి 2025 వరకు ఆపరేషన్ జన జాగరన్ అభియాన్, సల్వాజూడం, గ్రీన్ హంట్,ఆపరేషన్ సమాధాన్,ఆపరేషన్ అనకొండ, చివరకు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను అడవుల నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.అందులో బాగాంగానే ఆరు నెలల పసి గుడ్డు  మంగ్లీ సోడి మొదలు రేణుక మిడ్కో వరకు దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగిస్తున్నదని ఆరోపించారు.దీనికోసం ఆదివాసీలకు అన్ని వర్గాల ప్రజలు, దళితులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. భూమి, భూక్తి, విముక్తి, ఆత్మగౌరవం  కోసం జరిగిన ఇంద్రవెల్లి పోరాటంలో  ఆదివాసులపై జరిగిన హత్యకాండను నిరసిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు వక్తలుగా వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్,సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సిఎల్ సి ,రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, సిపిఐయం ఎల్ ఏ ,కూనంనేని సంబశివరావు, సి ఎల్ సి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్. నారాయణ రావు, సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే  గుమ్మడి నర్సయ్య, ఐఎప్ టి యు రాష్ట్ర అధ్యక్షులు కట్ట విశ్వనాథ్, సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి పాల్గొంటారని తెలిపారు.కావున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, రైతులు, రైతు కూలీలు, కార్మిక, కర్షక, మహిళా, యువజన,విద్యార్థి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు గుమ్మడి కొమురయ్య , రామిళ్ల బాపు, ఎరుకల రాజన్న, కొయ్యూరు గ్రామ ఆదివాసీ ప్రజలు గడ్డం లక్ష్మణ్, గుంటి రమేష్, గుంటి బాపు, గొట్టం ఎల్లయ్య, గుంటి నాగరాజు, గొట్టం దేవేందర్, చేద మల్లేష్, గుంటి చిన్న లచ్చయ్య, బీస్లా అశోక్, తోట రామకృష్ణ, ఆర్వెంది శశి, రాంగోతు శిలా నాయక్, చేద ధర్మక్క, గొట్టం సమ్మక్క,లక్ష్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img