- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క’, దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నెలాఖరున ఢిల్లీలో జరగనున్న వేడుకల్లో విజేతలకు పురస్కారాలను అందజేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న విడుదలైన ‘క’ చిత్రం, చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటించారు. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.