నటన
విలేకరి : మీరు సినీరంగం నుండి రాజకీయ రంగానికి వెళ్ళబోతున్నారని అందరూ అనుకుంటున్నారు నిజమేనా?
హీరో : రాజకీయాల్లోకి వెళ్ళాలని గతంలో అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు.
విలేకరి : ఎందుకని?
హీరో : రాజకీయాల్లో నుండి సినీరంగంలోకి వస్తేనే ఈజీగా నటించొచ్చని ఆలస్యంగా తెలిసింది.
డిస్కౌంట్
షాపు యజమాని : మా షాపులో ఏది కొన్నా రెండు రూపాయల డిస్కౌంట్ ఇస్తాం.
కొనే వ్యక్తి : అయితే రెండు రూపాయల షాంపూ ప్యాకెట్ ఇవ్వండి.
ఛాలెంజింగ్ జాబ్
టీచర్ : కిషోర్… నువ్వు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నావ్?
కిషోర్ : డాక్టర్, ఇంజనీరింగ్ లాంటివి కాకుండా ఏదైనా ఛాలెంజింగ్ జాబ్ చేయాలని ఉంది.
టీచర్ : గుడ్… ఇంతకీ ఏ జాబ్ సెలక్ట్ చేసుకుంటున్నావ్?
కిషోర్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్.
అందరూ వాడితే ఎలా?
కష్టమర్ : నాకు విండ్ ప్రూఫ్ రౌటర్ కావాలి. మీదగ్గర ఉందా? లేదా తయారు చేసివ్వగలరా?
ఐ.టి డెవలపర్ : విండ్ ప్రూఫ్ రౌటర్ కావాలా? అదెందుకు?
కష్టమర్ : నా వైఫై సిగల్స్ గాలి ద్వారా అందరికీ చేరిపోతుంది.
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -