- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం అట్టహాసంగా బీఆర్‌ఎస్ రజతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ శ్రేణులు జన సమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ రజతోత్సవ జోష్ కనిపిస్తున్నది. నగరంలోని కూడళ్లన్నీ గులాబీ జెండాలతో నింపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై యావత్తు తెలంగాణ ప్రజానీకం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.