Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్య

పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఫలక్‌నుమా రౌడీషీటర్ మాస్ యుద్దీన్ (మాసిని) దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి మాస్ యుద్దీన్‌ను హతమార్చారు. మూడు రోజుల క్రితమే మాస్ యుద్దీన్‌కు వివాహం జరిగింది. ప్రత్యర్థులే మాస్ యుద్దీన్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డుపై రౌడీ షీటర్ హత్య జరగడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పాతబస్తీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img