Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్పూరి గుడిసె లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

పూరి గుడిసె లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలో పూరి గుడిసె లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని దీనికి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు ముందుండి ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు కావడానికి కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు బిటి రోడ్డు లేని గ్రామంగా ఆ గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే మూడు కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు నిర్మాణం కోసం శనివారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నా తపన వెనుకబడ్డ జుక్కల్ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పూరి గుడిసె లేనివిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడానికి ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం పూరీ గుడిసె లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని ఇన్ని అన్ని అనకుండా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు కావడానికి నాయకులు కార్యకర్తలదే బాధ్యతని ఎమ్మెల్యే నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఇందిరమ్మ ఇల్లే కాకుండా బీటీ రోడ్డు లేని గ్రామాలకు నియోజకవర్గంలోని బీటీ రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు రాబట్టడం జరుగుతుందని పంచాయతీరాజ్ గాని ఆర్ అండ్ బి గాని జాతీయ రహదారులు గాని రోడ్ల నిర్మాణాలకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో నూతన బస్టాండ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెట్టడం జరిగిందని నియోజకవర్గంలో బస్సు డిపో మంజూరు కోసం కృషి జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి నా తపన అని ఎమ్మెల్యే పేర్కొన్నారు బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో రాచూరు గ్రామ ప్రముఖులు రాజు పటేల్ శంకర్ పటేల్ అదేవిధంగా మద్నూర్ బిచ్కుంద వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -