Tuesday, April 29, 2025
Homeజాతీయంపెద్దిరెడ్డి అనుచరుడు అరెస్టు..

పెద్దిరెడ్డి అనుచరుడు అరెస్టు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ద‌స్త్రాల ద‌హ‌నం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచ‌రుడు వంక‌రెడ్డి మాధ‌వ‌రెడ్డిని నిన్న సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న నెల రోజులుగా ప‌రారీలో ఉన్నారు. మాధ‌వ‌రెడ్డిని ప‌ట్టుకునేందుకు సీఐడీ అధికారులు నిఘా పెట్టిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. చివ‌ర‌కు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండ‌లం పెద్ద‌గొట్టిగ‌ల్లు వ‌ద్ద త‌న ఫాంహౌస్‌లో ఉన్నార‌నే స‌మాచారంతో సీఐడీ అధికారులు దాడి చేసి ప‌ట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img