Wednesday, May 21, 2025
Homeట్రెండింగ్ న్యూస్పెరుగుతున్న ఎండల తీవ్రత..

పెరుగుతున్న ఎండల తీవ్రత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -