Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంపోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లారు. ఆమె వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలతో కూడిన భారత ప్రతినిధి బృందం కూడా వాటికన్‌కు పయనమైంది. ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికన్‌లో ఏప్రిల్ 26న జరగనున్న ఆయన అంత్యక్రియల కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఆమె వాటికన్‌లో పర్యటిస్తారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించి, సంతాపం తెలియజేస్తారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 25న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా వద్ద దివంగత పోప్‌కు రాష్ట్రపతి పుష్పాంజలి ఘటిస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img