నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీలపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో పోరాడటం లేదని, వాళ్లు చేతకాని దద్దమ్మలుగా మారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కగా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే.. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు..? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే వారిని సహించమని ఆయన హెచ్చరించారని మండిపడ్డారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావొద్దదన్నదే రాంచందర్ రావు వైఖరి అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారనే ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోతున్నారని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలు చేతకాని దద్దమ్ములు: ఎమ్మెల్యే బీర్ల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES