కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి ‘జూనియర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్‌తో నిండిన ఈ ఎంటర్టైనర్‌ను రాధా కష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా ప్రోమోలకు మంచి స్పందన అందుకుంది. కిరీటి తన డైలాగ్ డెలివరీ, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కిరీటీకి జోడీగా కనిపించనుంది. అలాగే జెనీలియా కీలక పాత్రలో వెండితెరకు కవ్ బ్యాాక్ ఇస్తుండగా, కన్నడ స్టార్ రవిచంద్ర కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు మూవీ టీం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను రివిల్ చేసింది. ఈ చిత్రం జూలై 18న థియేటర్లలోకి రానుంది. కుటుంబంతో కలిసి సరదాగా, భావోద్వేగాల జర్నీని ఈ సినిమా అదించబోతోంది. కిరీటి, జెనీలియా, డా.రవిచంద్ర వి, శ్రీలీల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రాధా కష్ణ, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కె కె సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్, డైలాగ్స్: కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, లిరిక్స్: కల్యాణ్ చక్రవర్తి, శ్రీమణి.