No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeప్రధాన వార్తలుమరోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని

మరోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని

- Advertisement -

– సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇటి.నర్సింహా
– 101 మందితో నూతన రాష్ట్ర సమితి
– ముగిసిన సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రెండోసారి ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇటి.నర్సింహా ఎన్నికయ్యారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ‘కామ్రేడ్‌ పొట్లూరి నాగేశ్వరరావు నగర్‌'(గాజుల రామారం)లో జరిగిన సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభ చివరి రోజు శుక్రవారం కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పది మంది కార్యదర్శివర్గ సభ్యులు, 32 మంది కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 101 మందితో నూతన రాష్ట్ర సమితి ఎన్నికైంది. కార్యదర్శిగా కూనంనేని పేరును సీనియర్‌ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, కలవేన శంకర్‌ బలపర్చారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సమితి ఏక్రగీవంగా ఆమోదం తెలియజేసింది. రాష్ట్ర సమితికి క్యాండిడేట్‌ సభ్యులు, ఆహ్వానితులను, రాష్ట్ర కార్యవర్గానికి ఆహ్వానితులను కూడా ఎన్నుకున్నారు. నూతన నాయకత్వాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా అభినందించారు. రాష్ట్రంలో సీపీఐని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు : కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకటరెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, భాగం హేమంతరావు, కలవేన శంకర్‌, ఎం.బాలనర్సింహా, విఎస్‌.బోస్‌, ఇటి.నరసింహా.
రాష్ట్ర కార్యవర్గం: కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు,ó భాగం హేమంతరావు, కలవేన శంకర్‌, ఎం.బాలనరసింహా, విఎస్‌.బోస్‌, ఇటి.నరసింహా, బొమ్మగాని ప్రభాకర్‌, వి.సీతారామయ్య, పల్లా నర్సింహారెడ్డి, నెల్లికంటి సత్యం, ఎస్‌.కె.సాబీర్‌ పాషా, దండి సురేశ్‌, సి.హెచ్‌.రాజారెడ్డి, ఎస్‌.బాల్‌రాజ్‌, మందా పవన్‌, బి.విజయసారధి, కర్రె భిక్షపతి, పాలమాకుల జంగయ్య, ఎన్‌.జ్యోతి, బెజవాడ వెంకటేశ్వర్లు, ఛాయాదేవి, రామడుగు లక్ష్మణ్‌, కలకొండ కాంతయ్య, ఇ.ఉమామహేశ్‌, పంజాల శ్రీనివాస్‌, ముత్యాల విశ్వనాథం, యానాల దామోదర్‌ రెడ్డి, షేక్‌ బాసుమియా.
ఆహ్వానితులు: గన్నా చంద్రశేఖర్‌, జమ్ముల జితేందర్‌రెడ్డి, రమావత్‌ అంజయ్య నాయక్‌, కల్లూరి వెంకటేశ్వరరావు, తాండ్ర సదానందం ఎన్నికవ్వగా, రంగారెడ్డి నుంచి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంది.

సీపీఐ నూతన రాష్ట్ర సమితి సభ్యులు
రాష్ట్ర కేంద్రం : కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, భాగం హేమంతరావు, కలవేణ శంకర్‌, ఎం.బాలనరసింహా, ఇటి.నరసింహా, విఎస్‌.బోస్‌, ఎన్‌.జ్యోతి, వి.సజన, ఎస్‌.బాల్‌రాజ్‌, ఎం.డి.యూసుఫ్‌, కలకొండ కాంతయ్య, సయ్యద్‌ వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర, కె.మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌, వి.సీతారామయ్య, బొమ్మగాని ప్రభాకర్‌, బి.ఎస్‌.ఆర్‌.మోహన్‌రెడ్డి, ఎన్‌.మధుకర్‌, రమావత్‌ అంజయ్య నాయక్‌, పల్లె నర్సింహా, కె.శ్రీనివాస్‌ రెడ్డి, కె.ధనుంజయనాయుడు, మారపాక అనిల్‌కుమార్‌.

జిల్లాల నుంచి : సుధాకర్‌(నిజామాబాద్‌), ఎల్‌.దశరథ(కామారెడ్డి), టి.ఎం.ఖాలీఖ్‌ (మెదక్‌), విజయలక్ష్మీ పండిట్‌ (వికారాబాద్‌), చెన్న విశ్వనాథం (జగిత్యాల), టి.నర్సింహా(నారాయణపేట్‌), బి.ఆంజనేయులు (గద్వాల్‌), బి.బాలకిషన్‌ (మహబూబ్‌నగర్‌), తోట మల్లికార్జున్‌రావు(ములుగు), ముడుపు ప్రభాకర్‌రెడ్డి (ఆదిలాబాద్‌), బద్రి సాయికుమార్‌ (ఆసిఫాబాద్‌), మంద సుదర్శన్‌ (సిరిసిల్లా), కె.విజయరాములు (వనపర్తి), సయ్యద్‌ జలాలుద్దీన్‌ (సంగారెడ్డి), మేకల రవి, షేక్‌ బాసుమియా, పంజాల రమేశ్‌ (వరంగల్‌), పంజాల శ్రీనివాస్‌, అందె స్వామి (కరీంనగర్‌), రామడుగు లక్ష్మణ్‌, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్‌ (మంచిర్యాల), తాండ్ర సదానందం, గోశిక మోహన్‌ (పెద్దపల్లి), దండి సురేశ్‌, జమ్ముల జితేందర్‌ రెడ్డి, ఎర్ర బాబు, ఎస్‌.కె.జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు (ఖమ్మం), ఎస్‌.కె.సాబీర్‌ పాషా, ముత్యాల విశ్వనాథం, కె.సారయ్య, సారెడ్డి పుల్లారెడ్డి, కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్‌, మున్నా లక్ష్మీకుమారి(కొత్తగూడెం), ఎస్‌.ఎం.డి.ఫయాజ్‌ (నాగర్‌ కర్నూల్‌), మందా పవన్‌,కె.శంకర్‌ (సిద్ధిపేట్‌), నెల్లికంటి సత్యం, పల్లా నర్సింహారెడ్డి, ఎల్‌.శ్రవణ్‌కుమార్‌ (నల్లగొండ), గన్నా చంద్రశేఖర్‌, బెజవాడ వెంకటేశ్వర్లు, ఎల్లావుల రాములు (సూర్యాపేట), గోదా శ్రీరాములు, యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణ, చేడె చంద్రయ్య (యాదాద్రి భువనగిరి), పాలమాకులు జంగయ్య, పానుగంటి పర్వతాలు, కె.రామస్వామి, ఎం.డి.ఫమీదా, ఓరుగంటి యాదయ్య (రంగారెడ్డి), ఇ.ఉమా మహేశ్‌, జి.దామోదర్‌రెడ్డి (మేడ్చల్‌), కర్రె భిక్షపతి, అదారి శ్రీనివాస్‌, సిరబోయిన కరుణాకర్‌, మందా సదాలక్ష్మి (హన్మకొండ), కొరిమి రాజ్‌కుమార్‌ (భూపాలపల్లి), సిహెచ్‌.రాజారెడ్డి, పాతూరి సుగుణమ్మ (జనగామ), బి.విజయసారధి, బి.అజరు సారధి(మహబూబాబాద్‌), స్టాలిన్‌, ఛాయాదేవి (హైదరాబాద్‌),ఇన్సాఫ్‌(1), నిర్మల్‌ జిల్లా(1), మజ్దూర్‌ ఫ్రంట్‌(1), రంగారెడ్డి (2) సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది.

క్యాండిడేట్‌ సభ్యులు
ముడుపు నళిని(మహిళా ఫ్రంట్‌), ఎం.నర్సింహా, బి.వెంకటేశ్‌(ట్రేడ్‌ యూనియన్‌), ఆజ్మీరా రామ్మూరి(గిరిజన సంఘం), కె.భూమయ్య (ఎఐకెఎస్‌), కె.వి.ఎల్‌.(అయిప్సో), జోగుల మల్లయ్య (మంచిర్యాల), సిద్ధినేని కరుణాకర్‌ (ఖమ్మం), సలిగండి శ్రీనివాస్‌ (కొత్తగూడెం), బంటు వెంకటేశ్వర్లు(నల్లగొండ), ఉస్తేల నారాయణరెడ్డి(సూర్యాపేట), టి.రామకృష్ణ, బుద్దుల జంగయ్య (రంగారెడ్డి).

ఆహ్వానితులు
కె.సూర్యనారాయణ (ఏఐకెఎస్‌), కె.శ్రీనివాస్‌ (ప్రజానాట్యమండలి), టి.వెంకట్రాములు(వత్తి సంఘాలు), ఎస్‌.బాబు(ఆర్‌టిసి), జానకిరామ్‌ (బ్యాంకింగ్‌), వి.చెన్నకేశవరావు(సిఆర్‌.ఫౌండేషన్‌), ఉజ్జిని రత్నాకర్‌రావు (తెలంగాణ అమరవీరుల ట్రస్ట్‌), కట్టెబోయిన శ్రీనివాస్‌(మహబూబాబాద్‌), ఇప్పకాయల లింగయ్య, బొల్లం పూర్ణిమ (మంచిర్యాల), ఎండి.సలీమ్‌, బి.జి.క్లెమెంట్‌(ఖమ్మం), ఎస్‌డి.సలీమ్‌, రావులపల్లి రవికుమార్‌, చండ్ర నరేంద్ర కుమార్‌(కొత్తగూడెం), వర్ల వెంకటయ్య, కౌకుంట్ల కేశవులుగౌడ్‌ (నాగర్‌కర్నూల్‌), ఉజ్జిని యాదగిరిరావు(నల్లగొండ), ఆది సాయన్న (జనగామ), నల్లు సుధాకర్‌రెడ్డి(మహబూబాబాద్‌), కమతం యాదగిరి, జి.చంద్రమోహన్‌గౌడ్‌ (హైదరాబాద్‌), తోట భిక్షపతి (హన్మకొండ), గౌతమ్‌ గోవర్ధన్‌ (పెద్దపల్లి), కె.ఏసురత్నం (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి), వీరభద్రయ్య (సింగరేణి), సిద్ధిపేట (1), యాదాద్రి భువనగిరి(1), రంగారెడ్డి(1) నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకోవాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి :సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న సీపీఐ శ్రేణులు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలలో పార్టీ ప్రాతినిధ్యం పెంచుకోవడం ద్వారా మరింతగా బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర మహాసభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. వందేండ్ల చర్రిత కలిగిన సీపీఐ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని, తగిన గుర్తింపు రాలేదన్న విమర్శలు ఉన్నాయని, అయితే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం పోరాడిన చర్రిత కలిగిన ఎర్రజెండాకు ఉందని చెప్పారు. సీపీఐ వద్దకు వెళ్తే తమకు నీడ (నివాస స్థలం) దొరుకుతుందనే నమ్మకం నేటికీ పేదలలో ఉండటం గర్వకారణమన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునే విధంగా భూపోరాటాల ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్టంలో ధరణి పోయి భూభారతి వచ్చినప్పటీ క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ భూ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టాలన్నారు. కమ్యూనిస్టు పార్టీకి ఉద్యమాలే ఊపిరి అని, రాష్ట్రంలో పార్టీని విస్తరించడానికి, బలోపేతం చేసేందుకు నాయకులు, శ్రేణులు కంకణబద్ధులు కావాలన్నారు.

బీజేపీ ప్రభుత్వం నియతృంత్వ, ఫాసిస్టు పాలనను కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు వామపక్ష పార్టీలు ఆచితూచి అడుగులు వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ‘బీజేపీ హటావో దేశ్‌కో బచావో’ నినాదంతో దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని సీపీఐ నిర్వహించిందని గుర్తు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad