Wednesday, April 30, 2025
Homeజిల్లాలుమహిళా విధ్యార్థినులకు ఉచితంగా సమ్మర్ క్యాంప్ 

మహిళా విధ్యార్థినులకు ఉచితంగా సమ్మర్ క్యాంప్ 

– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ విద్యార్థినిల కోసం వేసవికాలంలో ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని మహిళా విధ్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిభిరాన్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ 25వ తేదీ నుండి మే రెండో తేదీ వరకు ఉంటుందన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల ఆర్బివిఆర్ఆర్ పాఠశాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీరికి ఉదయం అల్పాహారం (బ్రేక్ ఫాస్టు) ఉచితంగా అందిస్తామన్నారు.  సమ్మర్ క్యాంపు కు 9వ తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ  శిక్షణా శిభిరంలో విధ్యార్థినులకు తమను తాము రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మసంరక్షణ ) భవిష్యత్తు నిర్మించుకోవడానికి మోటివేషన్ ( ప్రేరణ) సమాజంలో మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీస్ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విధ్యార్థులు తమ పేర్లను తేది 13-4-2025 నుండి తేదీ 24-4-2025 వరకు ఫోన్ నెంబర్  90009 94312కు(లేదా) వెబ్ సైట్ ను https://docs.google.com/forms/d/e/1FAIpQLSejhLV9CEl9MKYqKI5dLUMUwNWNcMwLQwcfj8DXdme20G1JHg/viewform?usp=dialog సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోగలరు  సిపి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img