నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు తెగబడిన ముష్కరుల ఊహాచిత్రాలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా సంస్థలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ భయంకరమైన దాడి వెనుక ఉన్న క్రూరమైన ప్రణాళికను వెలికితీయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదలయ్యాయి.
- Advertisement -