నవతెలంగాణ – భువనగిరి
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ కోరారు. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని ప్రైవేటు వరం చేస్తూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మెప్పు కోసమే కార్మిక చట్టాలను కుదించాలని ప్రయత్నిస్తుందని అయన ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ సహాయ కార్యదర్శులు కూరేళ్ల మచ్చగిరి, గనబోయిన వెంకటేష్, గోపగాని రాజు, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, పల్లె శ్రీనివాస్, పుట్ట రమేష్, కౌన్సిల్ సభ్యులు చొప్పరి సత్తయ్య, దుబ్బాక సంజీవ, దాసరి లక్ష్మయ్య, పాపగళ్ల శంకరయ్య, ముదిగొండ బస్వయ్య, గౌరవంతల శ్రీనివాస్, పురుగుల రవి, ఎస్. కే మన్సూర్ పాషా, పాల్గొన్నారు.