Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్మొబైల్ విడండి.. ఆటలు ఆడండి.. ఆత్మస్టైర్యాన్ని పెంచుకోండి..

మొబైల్ విడండి.. ఆటలు ఆడండి.. ఆత్మస్టైర్యాన్ని పెంచుకోండి..

- Advertisement -

– ఎస్ హెచ్ ఓ మహ్మద్ షరీఫ్..

నవతెలంగాణ డిచ్ పల్లి

మొబైల్ విడండి.. ఆటలు ఆడండి.. ఆత్మస్టైర్యాన్ని పెంచుకోండని, యూవత దేశానికి వెన్నెముక్క అని ఈ రోజుల్లో యువత కానా, పిన, ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ అన్నారు. మండల కేంద్రంలోని జి పిఎల్ బహుమతుల ప్రదానం కు ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మహమ్మారికి అలవాటు పడి కుటుంబానికి దూరం అవుతున్నారని, ఇలాంటి సమయంలో ఘనపూర్ లో ఉన్న కొందరు మంచి ఆలోచన చేసి అందర్నీ ఒక్క దగ్గరికి తీసుకవచ్చి సెలవుల్లో మొబైల్కు, మత్తుకు, అట్రాక్ట్ కాకుండ గత 14 ఏళ్లుగా జి పి ఎల్ నిర్వహించడం గొప్ప విషయమాన్నారు.

చిన్న పిల్లలకు బైక్ ఇవ్వవద్దని, బైక్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం కోలుకోదని వివరించారు.ఘనపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎ స్వాతి విద్యార్ధిని సన్మానం చేశారు. జి పి ఎల్ టర్నమెంట్ లో విజయం సాధించిన వాసరి సాయినాథ్ టీమ్ కీ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో యువసేన యూత్, కర్ని గంగాధర్, కుర్రి రామకృష్ణ,హరీష్, నరేష్, శ్రీకాంత్, గంగమోహన్,పృథ్వి రమణ,కెప్టెన్స్ బి గంగదాస్, బి.కృష్ణ, ఎం ఓం ప్రసాద్,సాయిలు, రాజు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -