Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంయూపీిఐ సేవల్లో అంతరాయం

యూపీిఐ సేవల్లో అంతరాయం

- Advertisement -

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐల్లో మరోమారు అంతరాయం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు స్తంభించడంతో పలు చెల్లింపులు నిలిచిపోయి.. వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీయం, ఇతర థర్డ్‌ పార్టీ యాప్స్‌ పని చేయలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది నెటిజన్లు నిరసన, అసహనంను వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్య వల్ల చెల్లింపుల్లో అవాంతరం చోటుచేసుకుందని ఎన్‌పీసీఐ తెలిపింది. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇంతక్రితం మార్చి 26న, ఏప్రిల్‌ 2న కూడా యూపీఐ చెల్లింపుల్లో అంతరాయం చోటుచేసుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad