Thursday, November 13, 2025
E-PAPER
Homeఖమ్మంరాజకీయాలకు అతీతంగా ప్రజాసంక్షేమం

రాజకీయాలకు అతీతంగా ప్రజాసంక్షేమం

- Advertisement -

– పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక: ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

పధకం ఏదైనా పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి, రాజకీయాలకు ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నానని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. గురువారం ఆయన మండలంలో పర్యటించి వినాయకపురం,వేదాంత పురం లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించారు.  అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ గృహం నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అని,పేదల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు.

అశ్వారావుపేట లోని తన అధికారిక నివాసం( క్యాంపు కార్యాలయం)లో మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్  లబ్ధిదారులకు రూ.5,21,500 లు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాసేవ లోను,నియోజక అభివృద్ది లోను రాజకీయాలు అవసరం లేదని,నా ప్రతి కదలిక ప్రజా సేవకే అని పేర్కొన్నారు.ప్రజల కష్టాల్లో తాను ఎప్పుడూ అండగా ఉంటానని,తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మినీ స్టేడియం నిర్మాణం,సెంట్రల్ లైటింగ్,రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. యువత క్రీడల్లో రాణించడానికి స్టేడియం,ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రోడ్ల విస్తరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన ఆద్యంతం ప్రజలు, యువత,మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.పూలు,మేళతాళాలతో ఎమ్మెల్యే జారె కు ఘన స్వాగతం పలికారు. ప్రజల సమస్యలను విని వెంటనే స్పందించే ఆయన శైలి ప్రజల్లో మరింత విశ్వాసాన్ని, ఆశను నింపింది. 

ఈ కార్యక్రమలో ఎంపీడీఓ అప్పారావు,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -