– రెవెన్యూ శాఖలో లీకేజీలకు చెక్
– డేటా షేరింగ్ కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
– స్థానిక సంస్థలు వినోద పన్ను విధింపుపై పరిశీలన
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెవెన్యూ వసూళ్లలో పారదర్శకత పెంచుతూ లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెవ్ వన్ ఏకీకృత పోర్టల్‌కు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖలో లీకేజీలకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. రియల్‌టైమ్ డేటా షేరింగ్ కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిజిటల్ లావాదేవీలపై పర్యవేక్షణకు చట్టసభ్య మార్పులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ సంపాదించే శాఖల మధ్య రియల్ టైమ్ డేటా షేరింగ్‌ను అమలు చేయడం ద్వారా ఆదాయ, నష్టాలను తగ్గించడం ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా విభాగాల మధ్య డేటాను సమన్వయం చేసి అక్రమాలు, లీకేజీలను గుర్తించే అవకాశముంటుందని పేర్కొన్నారు. అన్ని శాఖలనూ అనుసంధానించే ఇంటెలిజెన్స్ ఆధారిత రెవెన్యూ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ఆ పోర్టల్ ఉద్దేశమని వివరించారు. స్థానిక సంస్థలు వినోద పన్ను విధించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించనుందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా జరిగే లావాదేవీల డేటాను పరిమిత కాలానికి సేకరించి నిల్వ చేసే విధానంపై చట్టపరమైన మార్పులను పరిశీలించనుందని పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ చైర్మెన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి, సభ్యులుగా ఆర్థిక, రవాణా, మున్సిపల్, ఐటీ, లీగల్ శాఖల ఉన్నతాధికారులుంటారని వివరించారు. 30 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలనీ, 60 రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
‘రెవ్ వన్’ పోర్టల్‌కు శ్రీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



