Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

- Advertisement -

చోద్యం చూస్తున్న అధికారులు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం
రహదారుల వెంట,కల్లాల్లో ఇంకా కుప్పలుగా ధాన్యరాశులు
రైతుల కష్టాలు కంటే ముఖ్యమంత్రికి అందాల పోటీలు ఎక్కువయ్యాయి
అకాల వర్షాలకు నష్టపోయిన ఇతర పంటల రైతులను ఆదుకోవాలి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్న అవన్నీ ఉట్టిమాటల లాగానే ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా తన సొంత బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా కల్లాల వద్ద, రహదారులపై ధన్యరాసులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం కొనకపోయేసరికి అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని, తద్వారా ప్రభుత్వం రైతులను గోస పెడుతుందని ఆయన  విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్య  వైఖరి తోనే ధాన్యం నీటి పాలు అవుతున్నదని, తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యం తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదన్నారు. రైతులు గోడు వెళ్లబోసుకుంటు గతంలో కేసీఆర్ తడిచిన ధాన్యాన్ని కొన్న సంగతి గుర్తు చేసుకుంటున్నారన్నారు.కల్లాల వద్ద కొన్న ధాన్యం కూడా ట్రాన్స్ పోర్ట్ చేయడానికి సకాలంలో లారీలు ప్రభుత్వం పంపకపోవడంతో ధాన్యం నీటి పాలు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు పడుతున్న కష్టాల కంటే అందాల పోటీలు ముఖ్యమయ్యాయని  ఎద్దేవా చేశారు.ధాన్యం సేకరణపై అధికారులతో రివ్యూ చేయడానికి సమయం లేని ముఖ్యమంత్రి అందాల పోటీల విషయంలో ఎనిమిది సార్లు సమీక్ష నిర్వహించారని విమర్శించారు. రైస్ మిల్లులకు చేరిన ధాన్యం నుండి ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే  డిమాండ్ చేశారు.తడిచిన,  మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని,కొన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ తొందరగా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అకాల వర్షాలకు నష్టపోతున్న సజ్జలు, ఇతర పంటల రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకటనలో ప్రభుత్వానికి విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -