Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంట పాత్రలను శుభ్రంగా కడగాలి

వంట పాత్రలను శుభ్రంగా కడగాలి

- Advertisement -

– మండల ప్రత్యేక అధికారి, డీఎస్సీడివో రాజా గంగారాం 
– కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
విద్యార్థినిల కోసం భోజనం తయారు చేసే ముందు వంట పాత్రలను శుభ్రంగా కడగాలని మండల ప్రత్యేక అధికారి, డీఎస్సీడివో రాజ గంగారాం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తో కలిసి ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినిల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ఆయన తనిఖీ చేశారు. శుభ్రమైన వాతావరణంలో కలుషితం కాకుండా భోజనాన్ని సిద్ధం చేయాలని నిర్వహకులకు సూచించారు. విద్యాలయంలో ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.విద్యార్థులకు భోజనం అందించడం పూర్తయిన తర్వాత వంట పాత్రలను శుభ్రంగా కడిగి ఉంచాలని, వంట చేసే ముందు మరోసారి వాటిని శుభ్రంగా కడగాలని సూచించారు. విద్యాలయం కోసం ప్రభుత్వం నుండి సరఫరా అయిన వంట సరుకులను ఆయన పరిశీలించారు.అనంతరం విద్యాలయంలో  రికార్డులను పరిశీలించి, ప్రత్యేక అధికారిని గంగామణికి పలు సలహాలు, సూచనలు చేశారు.తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాలయంలో, హాస్టల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.విద్యాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పంచాయతీ అధికారి సదాశివ్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -