- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో పాలన సజావుగా సాగడానికి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అస్థిరత తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు మదురోపై నార్కో టెర్రరిజం నేరాల కింద కేసు నమోదు చేసి విచారణ జరపనున్నారు.
- Advertisement -



