- జాతీయ నాయకులు కిషోర్ చంద్
- నవతెలంగాణ – రామారెడ్డి
- భారతీయ జీవిత బీమా లో పనిచేస్తున్న ఏజెంట్లంతా సమస్యల పరిష్కారానికి సంఘటితమై ఉండాలని సోమవారం జాతీయ నాయకులు కిషోర్ చాంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి భవనంలో ఏటీసీ హాల్లో లియాఫీ కార్యవర్గ సమావేశాన్ని కదం నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….. రానున్న మార్పులకు అనుగుణంగా మారవలసిన అవసరం ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం జాతీయ నాయకులు సంస్థ దృష్టికి తీసుకెళ్తుంనరని, సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బ్రాంచ్ సమస్యలపై పలువురు ఏజెంట్లు లేవనెత్తగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, ప్రదీప్ జైన్, ఉమాపతి, రాజిరెడ్డి, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -