అక్రమ అరెస్టులను ఖండించిన రాష్ట్ర కమిటీ
వెస్లీని పరామర్శించిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని, ప్రజాసంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే శనివారం నిర్బంధించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) నాయకులను కూడా అరెస్టు చేసి పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తమ పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వకున్నా నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అరెస్టులు, కేసులతో ఉద్యమాలు ఆగిపోవనీ, భవిష్యత్‌లో ప్రజా భూపోరాటాలు, ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నెల రోజులుగా రంగారెడ్డి జిల్లా కప్పాపహాడ్‌లో భూపోరాటం ఉధతంగా సాగుతున్నది. అనాజ్‌పూర్‌కు చెందిన పేదల భూములను రామోజీ ఫిల్మ్‌సిటీకి కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం జరిగిన ఆందోళన సందర్భంగా పార్టీ రాష్ట్రకార్యదర్శి వెస్లీ సహా నాయకులను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా పోల్కంపల్లి తదితర గ్రామాలకు చెందిన పేదలకు కేటాయించిన నాగన్‌పల్లిలోని ఇంటి స్థలాలను రామోజీ ఫిల్మ్‌సిటీకి అప్పజెప్పడాన్ని అడ్డుకునే పోరాటం సాగుతున్నది. ఈ పోరాటాల్లో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వారు హైదరాబాద్‌లో ఎక్కడ పోరాటం చేస్తారో అన్న భయంతో జాన్‌వెస్లీని, పార్టీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్ బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్ తెలంగాణ ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఐ.విజరు కుమార్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టి.నాగరాజు, ఉపాధ్యక్షులు అశోక్‌రెడ్డి, పాటల గోపి తదితరులు జాన్‌వెస్లీని పరామర్శించారు. వెస్లీ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. పేదలకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తుంటే నిర్బంధించడం తగదని హెచ్చరించారు. వెస్లీ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హౌస్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES