Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ..

సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ..

- Advertisement -

– ముగ్గురు సోదరులు సహా నలుగురు మృతి
రాంచీ :
జార్ఖండ్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఊపిరాడక ముగ్గురు సోదరులు సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. గర్హ్వా జిల్లాలోని నావాడా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇది కొత్తగా నిర్మించిన సెప్టిక్‌ ట్యాంక్‌ అని, షట్టరింగ్‌ను తొలగించిన తర్వాత నలుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు దానిలోకి ప్రవేశించారని గర్హ్వా సబ్‌డివిజనల్‌ ఆఫీసర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఊపిరాడకపోవడంతో నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లారని అన్నారు. గ్రామస్తుల సాయంతో వారిని బయట కు తీసి ఆస్పత్రికి తరలించామని, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారని తెలిపారు. మతులు అజరు చౌదరి (50), చంద్రశేఖర్‌ చౌదరి (42), రాజు శేఖర్‌ చౌదరి (55)లు సోదరులు కాగా, మరో వ్యక్తిని మాల్తు రామ్‌లుగా గుర్తించినట్టు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, మతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపామని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad