Saturday, May 17, 2025
Homeఅంతర్జాతీయంసౌదీ అరేబియాలో పాక్ బిచ్చ‌గాళ్లపై డిపోర్టేష‌న్

సౌదీ అరేబియాలో పాక్ బిచ్చ‌గాళ్లపై డిపోర్టేష‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో అప‌కీర్తిని ముట‌గ‌ట్టుకున్న పాకిస్థాన్..మ‌రోసారి అంత‌ర్జాతీయంగా ప‌రువుతీసుకుంది. సౌదీ అరేబియాతో పాటు ఇతర ముస్లిం దేశాల నుంచి 5,000 మందికి పైగా పాకిస్థానీ బిచ్చగాళ్లను తిరిగి స్వదేశానికి పంపినట్లు.. పాకిస్థాన్ హోంశాఖ మొహ్‌సిన్ నఖ్వీ ఈ విషయాన్ని తమ దేశ పార్లమెంట్‌లో వెల్లడించారు. సౌదీ అరేబియా, ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతర్, యూఏఈ వంటి దేశాల నుంచి మొత్తం 5,402 మంది బిచ్చగాళ్లను డిపోర్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఖ్యలో సౌదీ అరేబియా ఒక్కటే గత ఏడాది జనవరి నుంచి 5,033 మందిని తిరిగి పంపింది. ఈ బిచ్చగాళ్లలో ఎక్కువ శాతం సింధ్ ప్రాంతానికి చెందినవారేనని మంత్రి వివరించారు. ఈ బిచ్చగాళ్ల రాకను అదుపు చేయకపోతే భవిష్యత్తులో పాకిస్థానీ యాత్రికులకు వీసా ఆంక్షలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -