నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేశ్‌కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. గత వారం రెండు రోజుల పాటు ఈ సంస్థల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. కంపెనీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేశ్ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో, 2.5 కోట్ల రూపాయల ఆర్‌జీఎస్ ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనకు చెల్లించిన ఈ రెమ్యునరేషన్‌పై ఈడీ ఆరా తీయనుంది. కాగా, మహేశ్ బాబు భార్య పిల్లలతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.!
- Advertisement -