- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని అందులో వెల్లడించారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.