Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాఠశాల టెండర్లలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

పాఠశాల టెండర్లలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

- Advertisement -

అంబేద్కర్‌ జయంతినాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి: సీఎంకి ఆరెస్పీ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాఠశాల టెండర్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. జీవో నెంబర్‌ 17 వల్ల రాష్ట్రంలోని పేద కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. బడా కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే ఈఎండీ, ఎస్‌డీ పెంచారని చెప్పారు. ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతి నాడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ జీవో నెంబర్‌ 17ను మార్పులు చేయాలని హైకోర్టు సూచిం చినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ట్రంక్‌ బాక్స్‌లు, ప్లేట్లు, గ్లాసు లు, యూని ఫారాలు, నోట్‌ బుక్స్‌ వంటి వస్తువుల సరఫరాకు దేశ వ్యాప్తంగా టెండర్లకు ఆహ్వానం పలికిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -