ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు
జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం విదితమే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 73ని జారీ చేసింది. దానికి సంబంధించి ప్రాథమికంగా 22 కోట్ల రూపాయలను 2025-26 బడ్జెట్‌లో కేటాయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు రాష్ట్ర సర్కారు గుర్తించిన 421 ప్రయివేటు ఆస్పత్రుల్లో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స పొందొచ్చు. రాష్ట్ర సర్కారు డిజటల్ హెల్త్ కార్డులను కూడా అందజేయనున్నది.



