Monday, May 12, 2025
Homeజిల్లాలుఅ 'పూర్వ' కలయికకు 30 ఏండ్లు

అ ‘పూర్వ’ కలయికకు 30 ఏండ్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-కామారెడ్డి: 1994-95వ సంవత్సరంలో ప‌దో తరగతి చదివిన విద్యార్థులు.. 30 ఏళ్ల త‌ర్వాత పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం ద్వారా కలిశారు. వారంతా ఆదివారం దోమకొండ మండలం పెద్దమ్మ గుడి ఆవరణలో గల ఫంక్షన్ హాల్లో కలసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను తలచుంటూ.. చిన్న పిల్లల్లా మారి సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా తమకు చిన్నపుడు విద్యాబుద్దులు నేర్పిన గురువులకు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ గురువులు నేర్పిన విద్యతోనే తాము నేడు ఈ స్థానంలో ఉన్నామని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వివిధ రంగాలలో రాణించామ‌న్నారు. స్నేహానికి మించిన సంపద మరొకటి లేదని తమ మధ్యలేని స్నేహితులను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -