Tuesday, November 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహజ్‌ యాత్రకు 1.75 లక్షల మంది

హజ్‌ యాత్రకు 1.75 లక్షల మంది

- Advertisement -

భారత్‌, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం

రియాద్‌ : భారత్‌, సౌదీ అరేబియాల మధ్య జిద్దాలో 2026 కోసం ద్వైపాక్షిక హజ్‌ ఒప్పందం జరిగింది. ఈ హజ్‌ కోటా కింద భారత్‌ నుంచి 175,025 మంది యాత్రికుల సంఖ్యను నిర్ధారించారు. సౌదీఅరేబియాకు అధికారిక పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సౌదీ హజ్‌ , ఉమ్రా మంత్రి తౌఫిక్‌ బిన్‌ ఫౌజాన్‌ అల్‌ రబియా తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారతీయ యాత్రికుల సంక్షేమం, సౌకర్యాన్ని నిర్ధారించడానికి మిషన్‌, కాన్సులేట్‌ బృందాలు సౌదీ అధికారులతో సన్నిహిత సమన్వయంతో చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. రిజిజుతో పాటు అదనపు కార్యదర్శి (గల్ఫ్‌) అసీమ్‌ ఆర్‌. మహాజన్‌ , మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రెటరీ (హజ్‌) రామ్‌ సింగ్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -