- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: రాష్ట్రంలో ఈత సరదాకు 2 రోజుల్లోనే 10 మంది బలి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. కోనసీమ జిల్లా కమినిలంక వద్ద గోదావరిలో గల్లంతైన 8 మంది మరణించారు. వారందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు అదే జిల్లా పి. గన్నవరం మండలం నాగుల్లంకలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ప్రవీణ్ కుమార్ (15), సూర్య తేజ (12) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బాలుడి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
- Advertisement -