Friday, July 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆకలి కాటుకు 10మంది మృతి

ఆకలి కాటుకు 10మంది మృతి

- Advertisement -

– తాజా మృతులతో గాజాలో 111కి పెరిగిన కృత్రిమ కరువు మరణాలు
గాజా :
ఇజ్రాయిల్‌ విచక్షణారహితంగా జరుపుతున్న దాడులతో, నిత్యావసరాలపై విధించిన ఆంక్షలతో కుదేలైన గాజాలో గత 24గంటల్లో ఆకలిదప్పులతో అలమటిస్తూ 10మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో కృత్రిమంగా కల్పించిన కరువు కాటకాల బారిన పడి మరణించినవారి సంఖ్య 111కి పెరిగింది. వీరిలో 80మంది వరకు అభం శుభం తెలియని చిన్నారులే వున్నారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా బుధవారం ఉదయం నుండి దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 41కి పెరిగింది. కరువువాతన పడి మరణించేవారి సంఖ్య గాజావ్యాప్తంగా పెరుగుతోందని హెచ్చరిస్తూ 109 సహాయక సంస్థలు, మానవ హక్కుల గ్రూపులు తక్షణమే ఇజ్రాయిల్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ పిలుపిచ్చాయి. తక్షణమే మానవతా సాయంపై ఆంక్ష లన్నింటినీ ఉపసంహరించు కోవాలని కోరాయి. కాగా ఈ ప్రకటనను ఇజ్రాయిల్‌ తీవ్రంగా విమర్శించింది. ఈ సంస్థలన్నీ హమాస్‌కు ప్రచారం సాగిస్తు న్నాయని ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో వారు హమాస్‌ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలను కుంటున్నారని విమర్శించింది. హమాస్‌ వైఖరిని ప్రచారం చేయడం మానుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయిల్‌ బలగాలు గాజాపై దాడులు కొనసాగిస్తున్నాయి. గాజాలో పరిస్థితులు దుర్భరంగా మారిన పరిస్థితుల్లో తక్షణమే ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని యురోపియన్‌ యూనియన్‌ హెచ్చరించింది. ెురికా అధ్యక్షుడు ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్‌ గాజాలో కాల్పుల విరమణ చర్చల కోసం యూరప్‌కు వెళుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -