Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా రంగానికి 10 శాతం బడ్జెట్‌ కేటాయించాలి

విద్యా రంగానికి 10 శాతం బడ్జెట్‌ కేటాయించాలి

- Advertisement -

– యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు కోరారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వైస్‌ ఛాన్సలర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంజూరైన పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి, నియామక ప్రక్రియపై స్పష్టత, రోస్టర్‌ పాయింట్ల ఖరారు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, యూజీ, పీజీ, క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌, అడ్మిషన్ల కోసం కామన్‌ కరిక్యులమ్‌ కమిటీ ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. వైస్‌ ఛాన్సలర్లు చేసిన వినతులను ప్రభుత్వంతో పాటు సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి హామీనిచ్చింది. అంతకుముందు సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ యువత ఎక్కువగా ఉండి, శరవేగంగా సాంకేతిక ప్రగతి సాధిస్తూ, ఆవిష్కరణలు, ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ లీడర్‌గా ఎదిగే బలాలు కలిగి ఉందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు ఇ.పురుషోత్తం, ప్రొఫెసర్‌ ఎస్కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు పాల్గొన్నారు.

టీజీ సెట్స్‌ -2026కు కన్వీనర్లు
టీజీ సెట్స్‌ -2026కు తెలంగాణ ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీజీఎప్‌ సెట్‌కు ప్రొఫెసర్‌కు కె.విజయకుమార్‌ రెడ్డి (జేఎన్టీయుహెచ్‌), టీజీ ఎడ్‌సెట్‌కు బి.వెంకట్రామ్‌ రెడ్డి ( కెయు) ఐసెట్‌కు అలువుల రవి (మహాత్మాగాంధీ యూనివర్సిటీ), ఈసెట్‌కు పి.చంద్రశేఖర్‌ (ఒయు), లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు బి.విజయలక్ష్మి (ఒయు), పీజీఈసెట్‌ కె.వెంకటేశ్వర రావు (జేఎన్టీయుహెచ్‌), పీఈసెట్‌కు రాజేశ్‌ కుమార్‌ (శాతావాహన యూనివర్సిటీ) నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -