Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు 10 గుంటల భూదానం

పాఠశాలకు 10 గుంటల భూదానం

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని దుర్గా భవాని తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీణ్యా తండాలో ప్రభుత్వ పాఠశాలకు 10 గుంటల భూమిని ఆ గ్రామ నివాసి కీర్తిశేషులు గుగులోతు బోజ్యా నాయక్ కీర్తి ల జ్ఞాపకార్థంగా తమ కుమారులు కీర్తిశేషులు గుగులోతు క్రీస్టు నాయక్, గుగులోతు భీమ్లా నాయక్ గుగులోతు రాందాస్ నాయక్ లు భూదానం చేయడం అభినందనీయమని ఎంఈఓ రాందాస్ ఆ గ్రామ సర్పంచ్ వీరన్న అన్నారు.

సోమవారం వారి కొడుకులు మనమలు ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారి మనవాళ్లు గుగులోతు నవీన్ గుగులోతు రాము శంకర్ భూక్య వెంకన్న లు మాట్లాడుతూ.. ఈ గ్రామంలో మా తండావాసులు విద్యావంతులు అయి తండ అభివృద్ధికి సమాజానికి వారి సహకారం అందించాలంటే పాఠశాల అవసరమని గుర్తించి గత 1996వ సంవత్సరంలో 10 గుంటల భూమిని మా తాతగారు గుగులోతు భోజ్య నాయక్ కీర్తి ల పేరు మీద మా ముగ్గురు తండ్రులు అయిన కీర్తిశేషులు గుగులోతుకిస్తూ గుగులోతు భీమ్లా గుగులోతు రామదాసులు భూదానాన్ని ఇచ్చి పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు.

ఆ భూమిని ఆ రోజుల్లో భూదానం చేయడం వల్ల ఇక్కడ పాఠశాల ఏర్పడిందని చెప్పారు దీంతో తండావాసులు చదువుకొని కొంత విద్యావంతులయ్యారని అన్నారు. వారు భూదానం చేయడం పట్ల తండావాసులు అభినందనీయమని హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. తండాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నికి తండావాసులు సహకరించి వాళ్ళు అభివృద్ధి భాగంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి భూదానానికైనా ఆర్థికంగా అయినా ముందుకు రావాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.

అంగన్వాడీ టీచర్ కు కుక్కర్ అందజేత: గూగుల్ అవుతున్న నవీన్ 
మండలంలోని దుర్గాభవాని తండా గ్రామపంచాయతీ శివారు పీణలతాండ అంగన్వాడి టీచర్ సరస్వతికి తన సొంత ఖర్చులతో ఒక కుక్కర్ను అందించినట్లు గూగుల్ వద్దు నవీన్ తెలిపారు. పిల్లలను తీర్చిదిద్దాలని వారికి విద్యాబుద్ధులు మెరుగుపడే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ప్రెషర్ కుక్కర్ను అందించినట్లు తెలిపారు. ఈ పాఠశాల అభివృద్ధికి ఇంకా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంత్, కొమ్ము అనిల్, వడ్లకొండ యాకయ్య, మంద అశోక్, పరుపాటి వెంక రెడ్డి, గుబులోతు బాలాజీ నాయక్, బిలావత్ అమృనాయక్, గుగులోతు శ్రీనివాస్, గుగులోతు మధు, శేఖర్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, అంగన్వాడి టీచర్ సరస్వతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -