చందేల్: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్ కి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మీ తూర్పు కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ”ఇండో-మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న చందేల్ జిల్లా ఖెంగ్‌జోరు తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ క్యాడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ మే 14న ఆపరేషన్ ప్రారంభించింది” అని తెలిపింది. ఆపరేషన్ సమయంలో జరిగిన కాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు మ ృతి చెందగా, భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. కోహిమాలో ఉన్న డిఫెన్స్ పిఆర్‌ఓ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని,. అది ముగిసిన తర్వాత వివరాలను తెలియజేస్తామని తెలిపారు.